డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖిల్లా ఘనపూర్ మండలంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహానికి వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు టి. సాయి చరణ్ రెడ్డి గారు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. .
ఈ కార్యక్రమంలో ఖిల్లా ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు విజయకుమార్ గారు, ఇతర ముఖ్య నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి గారు మరియు యువజన పార్టీ సభ్యులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి అశేష నివాళులు అర్పించారు.
