నేను కూడా నా చిన్ననాటి చదువులు సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివాను అని గుర్తు చేసుకొని. విద్యార్థులు లక్ష్యసాధన కోసం కృషి చేయాలి విద్యా వైద్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట. విద్యార్థి దశలోనే మంచి మార్గం ఎంచుకొని లక్ష్య సాధనకు కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలి.విద్యార్థుల క్రమశిక్షణ అలవర్చుకొని ప్రణాళిక బద్దంగా ఇష్టపడి చదువుతూ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలి.

విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రభుత్వం పాఠశాలల్లో గురుకులాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అనేక పథకాలు అమలుపట్టుకున్నది ప్రతి ఒక్కరు వాటిని సద్వినియోగ కోవాలి.గతంలో ఎన్నడూ లేని విధంగా *నల్లమల్ల ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలను పెంచి విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రతి వ్యక్తికి తెలివితేటలు ఉంటాయని దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించడం జరిగింది.