భూత్పూర్ మండలం మద్దిగట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో అమ్మవారి ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.గ్రామానికి చెందిన బత్తిని కాంతారెడ్డి శ్రీమతి గీతల కుటుంబ సభ్యులు హరీష్ కుమార్ రెడ్డి, శ్రీమతి రాణి రెడ్డి, అరుణ్ కుమార్ రెడ్డి, శ్రీమతి హరితల ఆర్థిక సహాయ సహకారాలతో పాటు గ్రామస్తులు అందరూ కలిసి ఈ ఆలయాన్ని నూతనంగా నిర్మించుకున్నామని ఇందుకు దేవరకద్ర, వనపర్తి శాసనసభ్యుల సహా సహకారాలు కూడా అవసరమని పెద్దలు కాంత రెడ్డి గారు కోరడంతో అందుకు సానుకూలంగా స్పందించిన శాసనసభ్యులు ఇద్దరు ఆలయ అభివృద్ధి కోసం తమ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు