అచ్చంపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు అర్హులైన లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరగుతుంది. అర్హులైన లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగింది.
•ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత ఇసుక సరఫరా
•ఏటువంటి పైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుంది..
•ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం
తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పధకానికి నమూనా గా ఎంపికైన గ్రామాల్లో నిర్మాణాలు ప్రారంభించడానికి అధికారులు సిద్దం అవుతున్నారు. ఒక్కొక్క ఇంటికి రూ. 5 లక్షల నిధులను నాలుగు విడతలుగా విడుదల అవుతాయని, బేస్మెంట్ లెవెల్ వరకు రూ.1 లక్ష, లెంటెల్ వరకు రూ. 1 లక్ష ,స్లాబ్ పూర్తి అయిన తరువాత రూ.2 లక్షలు, ఇళ్ళు మొత్తం పూర్తి నిర్మాణం, రంగులు, బాత్ రూమ్, టాయిలెట్ నిర్మాణం పూర్తి అయిన తరువాత చివరి విడత రూ.1 లక్ష లబ్ధిదారుల ఖాతా ల్లో నేరుగా విడుదల చేస్తామని తెలుపడం జరిగింది.