ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని వనపర్తి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం తెల్లవారుజామున వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన సతీమణి శారదా రెడ్డి లు ఉత్తర ద్వారానికి ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఉత్తర ద్వారా ప్రవేశ కార్యక్రమం చేసిన ఆయన ఆలయంలోని స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.

ప్రత్యేక ఆసనం పై కొలువైన వెంకటేశ్వర స్వామికి దంపతులిద్దరు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం వేద పండితులు ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించి వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు.

అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి పట్టణ వాసులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్ కౌన్సిలర్లు బ్రహ్మం, సుజాత మధు, చీర్ల సత్యం, విభూది నారాయణ, కాంగ్రెస్ నాయకులు పెద్దలు గొల్ల వెంకటయ్య, లక్కాకుల సతీష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.