చాకలి ఐలమ్మ పోరాట పటిమను యావత్ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువలేరన్నారు. ఐలమ్మ పోరాటం ఫలితంగానే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిజాం నిరంకుశ పాలనను దహించివేసిందన్నారు.

నాలుగు వేల మంది అమరుల త్యాగాలతో తెలంగాణ చరిత్ర తిరగరాసిందని, 10లక్షల ఎకరాల భూ పంపిణీకి ఆమె పోరాటమే నాంది పలికిందన్నారు. ఐలమ్మ ఆశయసాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.