ఎంపీ ఎన్నికల ప్రచారం

ఖిల్లా ఘనపురం మండలం అల్లమాయపల్లి గ్రామంలో నిర్వహించిన ఎంపీ ఎన్నికల ప్రచారంలో వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి

నియోజకవర్గానికి ఇప్పటికే 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని ఎంపీ ఎన్నికలయ్యాక ప్రతి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం చేపడతామని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

ఆగస్టు 15వ తేదీ లోపు రెండు లక్షల రుణమాఫీ చేయడం ఖాయమని ఎవరు ఎన్ని మాటలు చెప్పిన నమ్మకూడదని వనపర్తి ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

అలాగే ఈ నెల 13న జరిగే ఎంపీ ఎన్నికల్లో మీరంతా హస్తం గుర్తుపై ఓటేసి డాక్టర్ మల్లు రవి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు

ఈ సందర్భంగా ఈర్లతాండ గ్రామానికి చెందిన 40 మంది BRS కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘా రెడ్డి వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు