సంతు శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు మేరమ్మ యాడి గుడి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిరుధ్ గారు…
గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు…
నవాబ్ పేట్ మండలంలోని వెంకటేశ్వర తండాలో నూతనంగా నిర్మిస్తున్న సంతు శ్రీ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు మేరమ్మ యాడి గుడి భూమి పూజ కార్యక్రమానికి నేడు జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు…
ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…
గిరిజన తండాల అభ్యున్నతి కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు… ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధికార ప్రతినిధి జనంపల్లి దుష్యంత్ రెడ్డి గారు, మండల కాంగ్రెస్ నాయకులు, గిరిజన ప్రజలు పాల్గొన్నారు…
