ఏనుముల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొన్న శ్రీ ఏపీ మిథున్ రెడ్డిగారు

దేశ రాజధాని ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికార నివాసంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు ఏనుముల రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మరియు మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి గారు అదే విధంగా మహబుబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు శ్రీ ఏపీ మిథున్ రెడ్డిగారు .

టీపీసీసీ అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించేందుకు ఏఐసీసీ కసరత్తు చేస్తోందనే ప్రచారం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసిందని అన్నారు. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పని చేస్తానని, అధ్యక్షుడి నియామకంపై తనకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. అధిష్ఠానం ఎవర్ని నియమించినా వారితో కలిసి పనిచేయడమే తన బాధ్యత అని అన్నారు. తాను టీపీసీసీగా ఉన్న కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంటు ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచామని ఆయన ప్రస్తావించారు. అసెంబ్లీ ఎన్నికలకు మించి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందని పేర్కొన్నారు.

ఇక కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేయడం వల్లే బీజేపీకి లాభం జరిగిందని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్‌కు డిపాజిట్లు వచ్చిన చోట తాము గెలిచామని, బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిన చోట బీజేపీ గెలిచిందని అన్నారు. ఢిల్లీ మీడియాతో ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు.

కక్షపూరిత రాజకీయాలకు పాల్పడబోను

తాను కక్షపూరిత రాజకీయాలకు పాల్పడబోనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌కు గద్దె దింపాలన్న తన జీవిత లక్ష్యం నెరవేరిందని అన్నారు. ‘‘ ముఖ్యమంత్రిగా నా రెండో కల నెరవేరింది. బీఆర్ఎస్‌ను లోక్‌సభభలో జీరో చేశాను. ఆ పార్టీని సున్నా చేయాలన్న కోరిక కూడా నెరవేరింది. తెలంగాణను పునర్నిర్మించడమే ఇప్పుడు నా ముందున్న ఏకైక లక్ష్యం. కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా ధ్వంసం అయింది’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *