కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యమ్మ
వనపర్తి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్యముతో పాటు కోశాధికారి చెన్నమ్మ ,కార్యదర్శి శారద , కోశాధికారి చిట్టెమ్మ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా శనివారం వనపర్తి నంది హిల్స్ లోనిఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వీరికి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు
నేడు ఇందిరమ్మ రాజ్యంలో మహిళకు గౌరవం దక్కుతుందని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ లో చేరినట్లు వారు పేర్కొన్నారు
కార్యక్రమంలో వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి అచ్యుతాపురం పాపిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.