క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొని పోటీని ప్రారంభించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి.

పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామంలో వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పెద్దమందడి మండలం సమన్వయకర్త తూడి శ్రీనివాస్ రెడ్డి గారి తల్లిదండ్రులు వెంకటమ్మ,సాయి రెడ్డి లా జ్ఞాపకార్థం గా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఆయన గురువారం ప్రారంభం చేశారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ పోటీ ప్రపంచంలో క్షణక్షణం చాలా విలువైనదని యువకులు విలువైన సమయాన్ని బంగారు భవిష్యత్తు కోసం కేటాయించాలని, ఉన్నతమైన చదువులు, క్రీడల తోపాటు తల్లిదండ్రులను దైవంగా భావించి ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.

క్రీడలలో గెలుపు ఓటములు సహజమేనని గెలిచినవారు ఓడినవారు ఎలాంటి బావోగ్వేదాలకు లోను కాకుండా క్రీడా స్ఫూర్తితో మెలగాలని ఆయన అన్నారు.