క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యం: మాధారం మాజీ సర్పంచ్ ధ్యాప నిఖిల్ రెడ్డి

క్రీడలను ప్రోత్సహిస్తా..

  • క్రీడల్లో రాణించి రాష్ట్ర స్థాయిలో పేరు ప్రతిష్టలు తీసుకురావాలి
  • మాధారం మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి గారు

ఊర్కొండ: క్రీడలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని మాధారం మాజీ సర్పంచ్ ధ్యాప నిఖిల్ రెడ్డి అన్నారు. జిల్లా స్థాయికి ఎంపికైనా కబడ్డీ క్రీడాకారులను గురువారం మండల కేంద్రంలో క్రీడా దుస్తులను ఆయన సొంత నిధులతో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు చదువులో బాగా రాణించాలని ఈ ప్రాంతానికి మన జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చి తమ భవిష్యత్తును బంగారమయం చేసుకోవాలని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. అదేవిధంగా నేడు క్రీడలకు ఉన్న ప్రాధాన్యత మరి దేనికి లేదని, అందుకు నేటి యువతీ యువకులు, చిన్నారులు క్రీడల్లో బాగా రాణించి తమ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చి తమ జీవితాలను ఉన్న స్థాయికి చేరుకునే విధంగా లక్ష్యం నేర్పరచుకొని ముందుకు వెళ్లాలని కోరారు. వారి వెంట మాజీ సర్పంచ్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు మ్యాకల శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు వెంకట్ రమణ, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి యాదయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నాయక్, నాయకులు వహీద్, రవి వాల్మీకి, కంఠం రాములు, భాస్కర్, దార రాజు, దయాకర్, శ్రీశైలం వ్యాయమ ఉపాద్యాయులు ఉన్నారు