క్రీడాకారులకు వాలీబాల్ కిట్టు అందజేసిన ద్యాప నిఖిల్ రెడ్డి గారు

ఉర్కొండ: మండల పరిధిలోని ఊరుకొండ పేట గ్రామంలో వాలిబాల్ క్రీడాకారులకు మాదారం మాజీ సర్పంచ్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి గారు వాలిబాల్ కిట్టును నిఖిల్ రెడ్డి యువసేన సభ్యుల ద్వారా క్రీడాకారులకు అందజేశారు. అనంతరం క్రీడాకారులు యువతకు ప్రోత్సాహం అందిస్తున్న ద్యాప నిఖిల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో NSUI మండల అధ్యక్షులు,కైసార్ జడ్చర్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మాసుమ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఆరిఫ్, అమ్ము, క్రీడాకారులు మల్లేష్,ఆంజనేయులు,భాస్కర్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.