ఖిల్లా ఘనపురం మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు

ఖిల్లా ఘనపురం మండలంలో సిసి రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, BT రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో ప్రాథమిక వసతులను మెరుగుపరిచే దిశగా చేపట్టబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ పక్కా ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు మన వనపర్తి MLA తూడి మేఘా రెడ్డి గారి సహకారంతో మంజూరు చేయబడ్డాయి.

మానాజీపేట గ్రామం నుంచి ఉప్పరపల్లి గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణానికి CRR నిధుల నుంచి రూ. 2 కోట్లు మంజూరు కాగా, ఈ పనులకు శంకుస్థాపన జరిగింది. అదేవిధంగా, మానాజీపేట గ్రామం నుంచి శాపూర్ గ్రామానికి CRR నిధుల నుంచి రూ. 1.50 కోట్లు వెచ్చించి BT రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మానాజీపేట గ్రామంలోని SC కాలనీలో CRR, SCP, MGNREGS నిధుల ద్వారా రూ. 20 లక్షలు ఖర్చుచేసి సిసి రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టబడనున్నాయి.

మల్కాపురం గ్రామంలో CRR, SCP నిధుల నుంచి రూ. 7.50 లక్షల వ్యయంతో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. శాపూర్ గ్రామంలో CRR, SCP నిధుల ద్వారా రూ. 45 లక్షల వ్యయంతో డ్రైనేజీలు, సిసి రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపనలు చేయడం జరిగింది. పర్వతాపురం, మామిడి మాడ, సల్కేలాపురం, అప్పారెడ్డి పల్లి, మల్కుమియన్ పల్లి, అల్లమాయపల్లి, తిరుమలాయపల్లి, వెంకటంపల్లి గ్రామాల్లో సిసి రోడ్లు, BT రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.

ఈ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రెడ్డి, సాయి చరణ్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, వెంకట్రావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నవీన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, మానాజీపేట మాజీ సర్పంచ్ సతీష్, క్యామా రాజు, ఆగారం, ప్రకాష్, లక్ష్మారెడ్డి, రవి నాయక్, దామోదర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, రాములు నాయక్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ అభివృద్ధి పనుల కోసం సాయి చరణ్ రెడ్డి గారు మన వనపర్తి MLA తూడి మేఘా రెడ్డి గారిని అభ్యర్థించగా, ఆయన సానుకూలంగా స్పందించి పనులకు అనుమతి మంజూరు చేశారు. అందుకు సాయి చరణ్ రెడ్డి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.