గురుకుల బాలికల పాఠశాల కళాశాలను సందర్శించారు ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

గోపాల్ పేట మండలం బుద్ధారంలో సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలను సందర్శించారు ఎమ్మెల్యే మేఘా రెడ్డి.

ఈ సందర్భంగా పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యే పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు డ్రమ్స్ మోగిస్తూ పూల బొకేతో శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది.

బుద్ధారం గండిలోని గురుకుల పాఠశాల సమీపంలోనే నియోజకవర్గస్థాయి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణం చేపడుతున్నామని బుద్ధారం గండి ప్రాంతం మొత్తం విద్యానిలయాలకు స్థావరం గా మారబోతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

అనంతరం ఆయన విద్యార్థులతో సరదాగా కాసేపు గడిపారు

పాఠశాల ఉపాధ్యాయినిలతో మాట్లాడిన ఆయన పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చారు