ఖిల్లా ఘనపురం మండలంలోని సోలిపూర్, సూరాయపల్లి, ఉప్పరపల్లి, షాగాపూర్, మానాజీపేట, గ్రామాలతో పాటు పలు గ్రామాలలో ఎంపీ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈనెల 13న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసే గెలిపిస్తే అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీలు, కేంద్రం ప్రకటించిన 5 గ్యారెంటీలు ప్రతి అర్హుడికి అందించే బాధ్యత తమదని అన్నారు.
పదేళ్ల బిఆర్ఎస్, బిజెపి పాలనలో ప్రజలకు మౌలిక వసతులు కరువై పల్లెలు పట్టణాలు అస్తవ్యస్తమయ్యాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తనకు 25వేల ఓట్లకు పైగా మెజార్టీ ఇచ్చిన ప్రజలు, పార్లమెంట్ ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవికి 50 వేలకు పైగా మెజార్టీ ఇవ్వాలని కోరారు.