మాట ఇచ్చిన ప్రకారంగానే చందాపూర్ గ్రామంలో పాఠశాల నుంచి గాంధీ నగర్ వరకు 10 లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేయడం జరిగింది. మరియ కెనాల్ కాలువను తవ్వి రైతులకు సాగునీరు అందిస్తాం అని ఆయన చెప్పడం జరిగింది.గ్రామానికి సాగునీరు అందించే కెనాల్ ను పరిశీలించి గ్రామానికి చెందిన గోల్లోని కుంట, వేదాంతచారి కుంటలకు సాగునీటికి మళ్ళిస్తే అక్కడినుంచి గ్రామానికి చెందిన 250 ఎకరాలకు సాగునీరు అందుతుందని అందుకు సంబంధించి అధికారులను ఆదేశించానని వారం రోజుల్లో సర్వే నిర్వహించి పనులు ప్రారంభిస్తారని ఆయన అన్నారు.
