చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి

చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

అనంతరం వనపర్తి బస్టాండ్ దగ్గర ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది.

రజకుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని, వనపర్తి నియోజకవర్గ పరిధిలోని రజకుల సమస్యల పరిష్కారాన్ని తాను ఎల్లవేళలా సహకరిస్తానని అందిస్తాను.

రజకులకు కావలసిన దోబి గట్ల ఏర్పాటు, సంఘ భవనాల నిర్మాణం ఇతరత్రా సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తాను.