చారకొండ మండల కేంద్రం జడ్పీ హైస్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతి….సావిత్రిబాయి పూలే జయంతిని. మహిళ ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించడం హర్షించదగినది మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జడ్పీ హైస్కూల్లో మహిళా ఉపాధ్యాయులకు సన్మానించడం జరిగింది.

సావిత్రి భాయి పూలే జయంతి సందర్భంగా మహిళ ఉపాధ్యాయుల దినోత్సవం గా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయo.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీస్కున్న ఈ నిర్ణయం అన్ని వర్గాల ప్రజలు స్వాగతించాల్సిన విషయం సావిత్రి బాయి పూలే మహిళల ను అక్షరాస్యులను చేయడానికి ఎంతో శ్రమించారు. ఆమె త్యాగాన్ని, కృషిని గుర్తించడం చాలా సంతోషకరమైన విషయం…గత ప్రభుత్వానికి ఇలాంటి మంచి ఆలోచనలు రాలేదు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ స్వార్థం కోసం మాత్రమే పని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం బిసి, బడుగు, బలహీన వర్గాలు కోసం వారి గుర్తింపు కోసం పని చేస్తుందని చెప్పడానికి ఇదే గొప్ప ఉదాహరణ* రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, మహిళ టీచర్లు సావిత్రి భాయి జయంతిని, మహిళ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరుపుకోవాలి