ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి. గత పదేళ్ల BRS పాలనలో ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల పట్ల చిన్న చూపుతో వ్యవహరించారని ప్రజాప్రతినిధుల పట్ల చిన్నచూపు ఉండకూడదని అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ముందుచూపుతో ముందుకెళ్లి ఉంటే బాగుండేదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వ్యాఖ్యానించారు.ప్రజా పాలన చివరి రోజు కార్యక్రమంలో భాగంగా వనపర్తి పట్టణం ఎనిమిదో వార్డు శ్రీనివాసపురం, రేవల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.