చెక్కులు పంపిణీ

ఇంటింటికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

వనపర్తి పట్టణంలోని ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను స్వయంవరం ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది

గతంలో అధికారుల కార్యాలయాల చుట్టూ ప్రజా ప్రతినిధుల ఇల్ల చుట్టూ కాల్లు అరిగేలా తిరిగిన కనుకరించకపోగా నిర్లక్ష్యంగా మాట్లాడే వ్యవస్థ నుంచి నేడు పేదల ఇంటి వద్దకే ప్రభుత్వ ఫలాలను అందజేస్తున్నారు వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి గారు

సందర్భంగాఎమ్మెల్యే గారు లబ్ధిదారులతో మాట్లాడుతూ… గత ప్రభుత్వా పాలనలు ప్రభుత్వ పథకాలను అందుకునేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందేనని నేడు ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలు ఒక్కరు కూడా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని ఈ క్రమంలోనే మీకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఇంటింటికి వెళ్లి అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాతనాటి కృష్ణయ్య, పట్టణ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు