పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ బూనీలా సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు.
ఈ సందర్భంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి గ్రామస్తులు డప్పు వాయిద్యాలతో మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు.
ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన స్వామివారు ఆశీస్సులను తీసుకొని అనంతరం భక్తులతో పాటు కలసి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొరు.
అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు చేపట్టిన భజన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కాసేపు స్వామివారి గీతాలాపనతో భజన చేశారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
