డిండి వాగులో చిక్కుకున్న చెంచు కుటుంబాలను రెస్క్యూ చేసి కాపాడిన పోలీసులు, భద్రతా సిబ్బంది .

అచ్చంపేట మండలం సిద్ద పూర్ సమీపంలో దుందుభి వాగు లో చిక్కుకున్న పదిమంది చెంచు కుటుంబాలు విషయం తెలుసుకుని హుటాహుటిన రెస్కి టీం పోలీసులు భద్రత సిబ్బందితో కలిసి ఉదయం ఐదు గంటలకే దుందిబి వాగు పరిసర ప్రాంతానికి చేరుకున్న.అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణవాగులో చిక్కుకున్న పదిమంది చెంచు కుటుంబాలను కాపాడడం జరిగింది.

వాగులో చిక్కుకున్న చెంచు కుటుంబాలకు నిత్యవసర సరుకులు తాగునీరు మందులు పంపిణీ చేశారు.. వాగులో చెక్కున్న వారిలో ఇద్దరు చిన్నపిల్లలు ఉండటంతో వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు.

అంతరం సరిహద్దు ప్రాంత దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారు విషయం తెలుసుకొని అచ్చంపేట ఎమ్మెల్యే గారితో కలిసి వరదల్లో చిక్కుకున్న చెంచు కుటుంబాలను పరామర్శించి వారికి పునరావాసం మనోధైర్యం కల్పించి అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు అనంతరం మెరుగైన వైద్యం మరియు వారికి కావలసినటువంటి ఆహార పదార్థాలను అందజేసిన ఎమ్మెల్యేలు.

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న వేళ అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగిన వెంటనే సమాచారం పోలీసు రెవెన్యూ శాఖ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు సమాచారం తెలియజేయాలని కోరడం జరిగింది.