గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభలో పాల్గొన మన వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు మరియు సాయి చరణ్ రెడ్డి
డిగ్రస్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రివర్యుల బహిరంగ సభలో వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారితో కలిసి పాల్గొన్న మన ఖిల్లా ముద్దు బిడ్డ సాయి చరణ్ రెడ్డి ఈ సభలో డిగ్రస్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాణిక్రావు థాకరే, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లూ రవి గారు మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు.
తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసంగం ఇచ్చారు ఈ ప్రసంగంలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు అందించే “5 గ్యారెంటీలు” గురించి వివరిస్తూ, ప్రతి ఒక్కరి జీవితాలను మెరుగుపరచడానికి తీసుకునే చర్యలను వివరించారు. ఈ 5 గ్యారెంటీల ద్వారా ప్రతి పౌరుడికి నాణ్యమైన ఆరోగ్య సేవలు, మంచి విద్య, భవిష్యత్తుకు పెట్టుబడి, వ్యవసాయ రంగంలో ప్రయోజనాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులు అందించడం వంటి అంశాలను ప్రధానంగా చర్చించారు.
ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు మన ఎమ్మెల్యే అభ్యర్థి మాణిక్రావు ఠాకరే గారిని మంచి మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. అదేవిదంగా గతం లో మాణిక్రావు ఠాకరే గారు చేసిన మంచి పనులను ముఖ్యమంత్రివర్యులు ప్రజలకు గుర్తు చేసారు.