మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్ర లోని యావత్మాల్ జిల్లా డిగ్రాస్ నియోజకవర్గం నేర్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గారు హాజరు కావడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ
ప్రజల మధ్యన మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఒంటెత్తు పోకడలు పోయే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలపై మాట్లాడే నైతిక హక్కు లేదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు విమర్శించారు..
ప్రజల స్థితిగతులను పట్టించుకోకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టే భారతీయ జనతా పార్టీ కి ఆరు గ్యారెంటీ లపై మాట్లాడే హక్కు లేదని తెలంగాణలో పూర్తిస్థాయిలో అమలైన గ్యారెంటీలపై తాము ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి గారు సవాలు విసిరారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో ప్రముఖ పాత్ర పోషించి ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిస్థాయిలో కృషిచేసిన గౌరవ శ్రీ మాణిక్ రావ్ ఠాక్రే గారిని గెలిపించుకుంటే మహారాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఈ గెలుపుతో జాతీయస్థాయిలో ఠాక్రే గారికి మంచి పొజిషన్ వస్తుందని ఆయన తెలిపారు.
మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఇన్చార్జిలుగా నియమించబడ్డ ఎమ్మెల్యేల పనితీరు ప్రశంసనీయమని ముఖ్యమంత్రి కొనియాడారు..
కార్యక్రమంలో యావత్మాల్ MP సంజయ్ దేశ్ముఖ్ గారు , శివసేన పార్టీ నాయకులు పవన్ జస్వల్ గారు, నాగర్ కర్నూల్ MP డాక్టర్ మల్లు రవి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు V హనుమంతరావు గారు, రాములు నాయక్ గారు, అచ్చంపేట ఎమ్మెల్యే డా చిక్కుడు వంశీకృష్ణ గారు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ,గారు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..