తెలంగాణలో మొట్టమొదటిసారిగా సన్న బియ్యం

పంపిణీ: ఖిల్లా ఘనపూర్ మండలంలో కార్యక్రమం ఘనంగా నిర్వహణ

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. గౌరవ వనపర్తి శాసనసభ్యులు తుడి మెగా రెడ్డి గారి ఆదేశానుసారం, ఈరోజు ఖిల్లా ఘనపూర్ మండలంలోని సల్కే లాపూర్, మామిడిమడ వెనికి తండా, అప్ప రెడ్డిపల్లి, పర్వతాపురం, అల్లమాయపల్లి రోడ్డు మీద తండా, కమలుద్దిన్పూర్, వెంకటంపల్లి, మనజీపేట గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

సందర్భంగా గ్రామ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గ సభ్యులకు, అలాగే వనపర్తి శాసనసభ్యులు గౌరవ తుడి మెగా రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో వనపర్తి కాంగ్రెస్ సీనియర్ నాయకులు టి. సాయి చరణ్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు వెంకట్రావు, క్యామా వెంకటయ్య, ఖిల్లా ఘనపూర్ సింగిల్ విండో చైర్మన్ మురళీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ క్యామా రాజు, ఆగారం ప్రకాష్, లక్ష్మి రెడ్డి, వనపర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాములు, కృష్ణయ్య, మాజీ సర్పంచ్ రాజు నాయక్, సోమ్లా రెడ్యానాయక్ రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గోనారు