మహారాష్ట్ర రాష్ట్రం యావత్మాల్ జిల్లా దీగ్రాస్ నియోజకవర్గం ధార్వాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది.
కాంగ్రెస్, శివసేన, NCP పార్టీల పొత్తులో భాగంగా దీగ్రాస్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాణిక్ రావు ఠాక్రే గారి గెలుపు ఇప్పటికే ఖాయం అయిందని
ప్రతి ఒక్కరం పార్టీలకతీతంగా పనిచేసి గౌరవ శ్రీ మాణిక్ రావు ఠాక్రే గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరికీ తెలియజేయడం జరిగింది.
ఇందిరమ్మ రాజ్యస్థాపనతోనే సమగ్ర అభివృద్ధి జరుగుతుందని, బడుగు బలహీన వర్గాలతో పాటు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందజేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పథకాలను రూపొందించిందని ఈ పథకాల ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది మాజీ ముఖ్యమంత్రి శివసేన పార్టీ పెద్దలు ఉద్దవ్ ఠాక్రే అన్నారు.
దీగ్రస్ నియోజకవర్గంలో ఎన్నికల సమన్వయకర్తలుగా పనిచేసే నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు, వనపర్తి ఎమ్మెల్యే అయిన తమరి కృషి ప్రశంసనీయమని ఆయన కొనియాడారు.
కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఇంతటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయడంలో ఎన్నికల ఇన్చార్జీలు ప్రముఖ పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆలయన్స్ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.