పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నాగర్ కర్నూల్ పార్లమెంట్ MP అభ్యర్థి డాక్టర్ మల్లు రవి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ ముఖ్య అతిథులుగా వచ్చిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు,రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి గారితో పాల్గొన్న వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు.ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ…. వనపర్తి లో జరిగిన అవినీతి అక్రమాలను ఒక్కటి ఒక్కటిగా బయటికి తీస్తామని, తిన్న అవినీతి సొమ్ము మొత్తం కక్కించి తీరుతామని…. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని హెచ్చరించారు.వనపర్తి లో గత నాయకుడు నిరంజన్ రెడ్డి కనిపించిన ప్రభుత్వ స్థలాలన్నీ కబ్జా చేశాడని, పెబ్బేరు సంతస్థలం, వనపర్తి లో దేవాదాయ భూమి, కృష్ణానది ఒడ్డున నది స్థలాన్ని ఏది వదలకుండా కబ్జా చేసిన ఘనుడు మాజీమంత్రి నిరంజన్ రెడ్డి అని అన్నారు. వనపర్తి శాసనసభ్యులు అయినవారు చాలామంది బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు చేరేలా సేవలందిస్తే… ఒక్కసారి గెలిచిన నాయకుడు కబ్జాలు, కమిషన్ లు దండుకొని ప్రజలను మోసం చేశాడు. అందుకే ప్రజలు తగిన గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు అని ఎమ్మెల్యే మెగా రెడ్డి అన్నారు. తాను అలా కాకుండా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సేవకుడిలా కుటుంబ సభ్యుడిలో ఒకడిలా… ఒక పెద్ద జీత గాడిలా ఉంటానని అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని జోష్యం చెప్పారు. కావున నాగర్ కర్నూల్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న డాక్టర్ మల్లు రవి గారికి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు..