
నాగార్జునకొండ ఆర్కియోలాజికల్ మ్యూజియం ను సందర్శించడం జరిగింది. ప్రపంచంలోనే రెండో ఆర్కలాజికల్ ఐలాండ్ మ్యూజియం అయిన నాగార్జున కొండ నాగార్జునసాగర్ బుధవనం సందర్శనలో భాగంగా… ఆర్కియోలాజికల్ మ్యూజియం నాగర్జున కొండను సందర్శించడం జరిగింది.
నాగార్జున కొండ మ్యూజియం క్యూరేటర్ కమలహాసన్ స్వాగతం పలికిన అనంతరం మ్యూజియంలోని బౌద్ధ శిల్పాలు, శాసనాలు ,పురావస్తు వస్తువుల గురించి, ఇక్ష్వాకుల కాలంలో శ్రీ పర్వత -విజయపురిగా పిలువబడిన నాగార్జున కొండ చారిత్రక విశేషాలను వివరించారు.