పలు ఆరోగ్య సమస్యలతో హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు పరామర్శించారు. ఆర్థిక సమస్యలున్న, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న తాను ఎల్లవేళలా అండగా ఉంటానని అధైర్య పడుద్దని భరోసా కల్పించారుకిడ్నీ సంబంధిత వ్యాధి తో ఇబ్బందితో చికిత్స పొందుతున్న పెద్దగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షులు నక్క రవికిరణ్ ,కాలు విరిగి చికిత్స పొందుతున్న వనపర్తి పట్టణం శ్రీనివాసపురానికి చెందిన విభూది పెద్ద వెంకటయ్యను పరామర్శించిన ఎమ్మెల్యే loc మంజూరు చేయిస్తానని ధైర్యాన్ని కల్పించారుఅలాగే రేవల్లి మండల కేంద్రానికి చెందిన టప్పరాజయ్య పేగు సంబంధిత వ్యాధితో చేరగా వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.