నియోజకవర్గ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలను కళాశాలలను పరిశీలించిన ఎంపీ మల్లు రవి,ఎమ్మెల్యే మేఘా రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
నేడు పెబ్బేరు, శ్రీరంగాపురం మండలంలోని కస్తూరిబాగాంధీ విద్యాలయం తో పాటు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఓ ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్న సోషల్ వెల్ఫేర్ బాలికల ఇంటర్మీడియట్, డిగ్రీ కళాశాలను ఎంపీ మల్లు రవి గారు,ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు,జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి గారు పరిశీలించారు.
వనపర్తి నియోజకవర్గం పరిధిలోని విద్యా వ్యవస్థను పూర్తిస్థాయిలో పటిష్టపరుస్తున్నామని ఇందుకు సంబంధించి రూ. 600 కోట్ల రూపాయలతో ప్రతి మండల కేంద్రంలో ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎంపీ, ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు పలు రకాల చర్యలను చేపడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు విద్యావ్యవస్థను పటిష్టపరిచేందుకు క్రమశిక్షణతో పని చేయాలని ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని వారు కోరారు
ఈ సందర్భంగా సోషల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి ఎంపీ మల్లు రవి గారు, ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గారు డిఈఓ గోవిందరాజులు గారు తో పాటు పలువురు అధికారులు విద్యార్థుల మధ్యన భోజనం చేశారు.