నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రజా పాలనలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రజా పాలనలో పాల్గొన్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు.గ్రామ స్వరాజ్యం తో గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని గాంధీ చెప్పిన మాటలకు అనుగుణంగా ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు అన్నారు.గురువారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలో ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి,జిల్లా అడిషనల్ కలెక్టర్ సంచిత్ గాంగ్వార్ తో కలిసి రూ.21 లక్షల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం,ప్రత్యేక అభివృద్ధి నిధుల ద్వారా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, మరియు రూ.24 లక్షల నేషనల్ హెల్త్ మిషన్ నిధులతో నిర్మించిన నూతన ఆరోగ్య ఉప కేంద్రం ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు మాట్లాడుతూ 6 గ్యారంటీలను అమలు చేస్తామన్న ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండు గ్యారెంటీలను అమలు చేశామని మిగతా నాలుగు గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని కూడా ఆయన తెలిపారు