పంచాయతీ అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి

గ్రామాలలో త్రాగునీరు పారిశుద్ధ్యం విద్యుత్ వంటి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి విజయదశమి రానున్నవేళ గ్రామాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించాలి అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో అచ్చంపేట డివిజన్ పంచాయతీ కార్యదర్శులు పంచాయతీ అధికారులు లతో సమీక్ష సమావేశం లో పాల్గొనీ గ్రామపంచాయతీ కార్యదర్శుల పనితీరు ఏమాత్రం బాగాలేదని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి మండల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా త్రాగునీరు విద్యుత్తు డ్రైనేజీ సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.. స్థానికంగా ఇబ్బందులు ఉన్నవేల సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చే తమ ద్వారా సమస్యలను పరిష్కరించుకొని ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుచున్నాము