పెబ్బేరు మున్సిపాలిటీలో పర్యటించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, స్థానిక సంస్థల కలెక్టర్ గాంగ్వర్.

ఈనెల 11, 12వ తేదీల్లో పెబ్బేరు పట్టణంలో జరిగే చౌడమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల మౌలిక వసతులను కల్పించాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు పెబ్బేరు పట్టణ మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు ను ఆదేశించారు.అలాగే చౌడేశ్వరి అమ్మవారి జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.పెబ్బేరు పట్టణంలోని సుభాష్ చంద్ర బోస్ చౌరస్తా నుంచి PJP క్యాంప్ వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, జూనియర్ కళాశాలకు సిసి రోడ్డు వేయించాలని, రోడ్డు వైండింగ్లో ఇళ్లను కోల్పోయిన బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించాలని, అలాగే కొందరు పట్టణంలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారని వారిపై విచారణ జరిపి ప్రభుత్వం స్థలాలను కాపాడుకోవాలని ప్రజలు ఎమ్మెల్యే గారిని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పెబ్బేరు పట్టణంలోని రోడ్డు వెడల్పులో వ్యాపార సముదాయాలను,ఇండ్లను కోల్పోయిన వారికి సరైన న్యాయం చేస్తామని ఆయన పేర్కొన్నారు.