ప్రజల హృదయాలు గెలిచిన నేత వైఎస్సార్‌

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాలను గెలుచుకున్న మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాలను గెలుచుకున్న మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని సోమ వారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సంక్షేమ పథకాలతో పేదల గుండెల్లో చిర స్థాయిగా నిలిచిన అపర భగీరథుడు డాక్టర్‌ వైఎస్సార్‌ అని అన్నారు. కార్యక్రమంలో మునిసి పల్‌ చైర్మన్‌ పుట్టపాకల మహేష్‌, వైస్‌ చైర్మన్‌ కృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చంద ర్‌, కౌన్సిలర్లు సత్యంసాగర్‌, విభూది నారాయణ, నక్కరాములు,యాదగిరి, మధుసూదన్‌గౌడ్‌, ఎల్‌ ఐసీ కృష్ణ, డీ వెంకటేష్‌, ప్రకాష్‌, లక్కాకుల సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.