ప్రపంచ కప్ కరాటే విజేతగా నిలిచిన విలాసను వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి సన్మానించారు. వనపర్తి మండలం చీమనగుంటపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తూర్పు తండాకు చెందిన విలాస నాయకుడు ఈ నెల 23న రష్యాలోని ఖజార్ హాస్ట లో నిర్వహించిన ప్రపంచ స్థాయి కరాటే పోటీల్లో పాల్గొన్నాడు. పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచాడు.ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆదివారం తన నివాసంలో క్రీడాకారుడిని అభినందించింది సన్మానించారు. తల్లిదండ్రులు హీర్యా నాయక్, చిట్టెమ్మలు కూలీలుగా జీవనం కొనసాగిస్తూ కష్టపడి తమ కుమారుడు విలాస్ ను చదివించడంతో పాటు యుద్ధక్రీడలో తర్ఫీదు నిప్పిచడం ద్వారా ఫలితం లభించడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను విద్యతో పాటుగా క్రీడలలోనూ రాణించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.