పెద్దమందడి మండలం అల్వాల గ్రామానికి చెందిన పలువురు ప్రమాదాలలో గాయపడి చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి గారు ఆదివారం రాత్రి గ్రామంలోని బాదిత కుటుంబాలను పరామర్శించి నేనున్నాననే భరోసా కల్పించారుఅదే గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ వెంకటయ్య కుమారుడు కురుమూర్తి రోడ్డు ప్రమాదానికి గాయపడ్డాడు.మరియు వెంకటమ్మ బస్సు దిగుతూ జారిపడి ప్రమాదానికి గురైంది అలాగే గ్రామ హరిజన నరసింహ కుటుంబాన్ని సైతం ఎమ్మెల్యే పరమార్శించి ఎలాంటి ఇబ్బంది లేదని ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైన తనను సంప్రదించాలని ఆయన సూచించారు.