ప్రాచీన కళలకు జీవం పోయాలి

ఊర్కొండ: ప్రాచీన కళలకు జీవం పోయాల్సిన అవసరం ఉందని మాధారం మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఊర్కొండపేటలో శివరాత్రి పురస్కరించుకుని మల్లికార్జున స్వామి వారి కళాకారులకు రూ.10,000/- ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాచీన కళాకారుల కు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, నేడు ప్రతి ఒక్కరు ప్రాచీన కళలకు చేయూత నివ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. కళాకారులు చుక్కపురం అంజయ్య గౌడ్, వడ్డేమోని చిన్న బాలయ్య, తీర్మని బొందయ్య, బొల్లమ్ వెంకటయ్య తదితరులు ఉన్నారు