ఫోటోగ్రాఫర్లు చేపట్టే సేవా కార్యక్రమాలు అభినందనీయం

ఫోటోగ్రాఫర్లకు అండగా ఉంటా

వనపర్తి నియోజకవర్గ పరిధిలోని ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ తరపున చేపట్టిన సేవా కార్యక్రమంలో పాల్గొని అలాగే వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ప్రారంభించడం జరిగింది.

వనపర్తి నియోజకవర్గ పరిధిలో ఉండే ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ తరపున చేపట్టే సేవా కార్యక్రమాలు అభినందనీయమని..ఫోటోగ్రాఫర్ల అభ్యున్నతికి తాను ఎల్లవేళలా సహకరిస్తానని

ఫోటోగ్రాఫర్లందరూ వారి ఫోటో స్టూడియోలకు ఇన్సూరెన్స్ చేసుకుని ఉండాలని దాంతో ఏదైనా ప్రమాదం సంభవించిన కుటుంబాలకు ఇబ్బంది ఉండదని

ఆర్థిక పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొనే ఫోటోగ్రాఫర్లలో అవసరం ఉన్నవారికి బ్యాంకు రుణాలు సైతం మంజూరు చేయించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని భరోసా ఇవ్వడం జరిగింది.

వనపర్తి నియోజకవర్గ పరిధిలోని ఫోటోగ్రాఫర్ లందరికీ కావలసిన కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు కావలసిన స్థలాన్ని సైతం సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని.

అనంతరం క్రీడాకారులతోపాటు క్రికెట్ ఆడి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.