బస్తీ దావఖానాను సందర్శించిన ఎమ్మెల్యే

వనపర్తి పట్టణంలోని 31 వ వార్డు కేడిఆర్ నగర్లో గల బస్తీ దవఖానాను శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి సందర్శించి పరిశీలించారుఈ సందర్భంగా ఆయన దావాఖానలోని సమస్య మెడికల్ ఆఫీసర్ ప్రమోద్ కుమార్ తో అడిగి తెలుసుకున్నారుల్యాబ్ టెస్టులకు సంబంధించి బాధితులకు త్వరితగతిన రిపోట్లను అందజేయలేక పోతున్నామని అందుకు కావలసిన ఏర్పాట్లు చేయవలసిందిగా కోరడంతో అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్య పరిష్కారం చర్యలు తీసుకుంటామన్నారు