బిఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్

తెలంగాణ అసెంబ్లీ కాంగ్రెస్ శాసనసభ పక్షం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు & అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో అన్ని వర్గాల ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ మహా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతూ ఉస్సెన్ సాగర్ లో ఉన్నటువంటి నీళ్లను ప్రజలు తాగే విధంగా తయారు చేస్తానని మాయమాటలు చెప్పాడు.. హుస్సేన్ సాగర్ చుట్టూ పెద్ద ఎత్తున భారీ టవర్ నిర్మించి నల్ల ఇస్తాంబుల్ చేస్తానని ప్రజలకు మాయమాటలు చెప్పి న ఎందుకో ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది.

తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు గుంటలను రక్షించాలని ఉద్దేశంతోనే హైడ్రా ఏర్పాటు చేయడం జరిగింది ఈ హైడ్రా వలన కబ్జాకు గురైన చెరువులు కుంటలను కాపాడటమే ప్రధాన లక్ష్యం… హైడ్రా పనితీరును ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు కొంతమంది గత బి అర్ ఎస్ నేతలు గత ప్రభుత్వ హాయంలో చేసినటువంటి కబ్జాలను ఎక్కడ బయటపడతాయని ఉద్దేశంతోనే బిఆర్ఎస్ పార్టీ నాయకులు హైడ్రాను వ్యతిరేకిస్తున్నారు . ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా హైదరాబాద్ జంట నగరాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో రకాలుగా మాయమాటలు చెప్పి ప్రజలను వంచించారు కాలేశ్వరం ,గండి పోచమ్మ, మల్లన్న సాగర్, కరువైన రిజర్వాయర్ అన్ని ప్రాజెక్టులు నాసిరకంగా కమిషన్ల కోసం కక్కుర్తి పడి నిర్మించారు కాబట్టి ఇప్పుడు అవి పూర్తిగా కూలీ పోతున్నాయి.

అధికారులకు రావడానికి ప్రయత్నం చేశారు కానీ తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పి పార్టీని భూస్థాపితం చేసే విధంగా ప్రజలు చేశారు కాబట్టి ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీని పై తప్పుడు ప్రచారం చేయకుండా ఉండి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం.