మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  గారితో ప్రత్యేక సమావేశాల్లో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు

రహదారుల పునరుద్ధరణకు మంత్రి ప్రత్యేక హామీతెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారువనపర్తి నియోజకవర్గ పరిధిలోని రెండు మునిసిపాలిటీలతో పాటు గ్రామీణ రోడ్ల పునరుద్ధరణ పై ప్రత్యేక దృష్టి సారించాలని వనపర్తి అభివృద్ధిలో  తనకు సహకరించాలని వనపర్తి ఎమ్మెల్యే  మేఘారెడ్డి గారు కోరారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి వనపర్తి , పెబ్బేరు మున్సిపాలిటీ లలో రోడ్ల పునరుద్ధరణకు పూర్తిస్థాయి సహకారం అందిస్తారని  ఆయన పేర్కొన్నట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు