వనపర్తి జిల్లా చిట్యాల గ్రామ శివారులోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది
ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన తమరికి విద్యార్థులు గౌరవ వందనంతో ఘనంగా స్వాగతం పలికారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు పెద్దపీట వేసిందని మండలానికికొక ఎడ్యుకేషనల్ హబ్ ను ఏర్పాటు చేసి నిరుపేదలందరికీ ఉన్నత విద్యను అందించేందుకు చర్యలు చేపట్టిందని.
విద్యుతతో పాటు ప్రతి విద్యార్థికి ఆటలు కూడా ఎంతో అవసరమని నేడు ఆటలలో విద్యార్థులను జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు విదేశాలకు పంపేందుకు సైతం తమకు మన హక్కు అన్ని అవకాశాలు ఉన్నాయని విద్యార్థులకు సూచించడం జరిగింది.
_*నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా తాను, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా శివసేన రెడ్డి గారు ఉన్నారని క్రీడల్లో నైపుణ్యం గల విద్యార్థులకు ఇది మంచి అవకాశం అని పూర్తిస్థాయిలో ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు*_
ఈ సందర్భంగా పాఠశాలలో విధులు నిర్వహించిన పూర్వపు ఉపాధ్యాయులను సన్మానించారు అనంతరం విద్యార్థులతో మమేకమైపోయి కాసేపు వారితో సెల్ఫీలు దిగుతూ సరదాగా గడపడం జరిగింది..
ఈ సందర్భంగా తమకు డైట్ చార్జీలు 1330 రూపాయలకు పెంచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలోవనపర్తి మున్సిపాలిటీ చైర్మన్ పుట్టపాకల మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ మండలాల నాయకులు విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.