మహా యోధుడు పాపన్న గౌడ్‌

బహుజనుల హక్కుల కోసం పోరాడిన మహా యోధుడు సర్ధార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.

బహుజనుల హక్కుల కోసం పోరాడిన మహా యోధుడు సర్ధార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఆదివారం కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాపన్నగౌడ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ నగేష్‌తో కలిసి ఎమ్మెల్యే మేఘారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై సర్వాయిపాపన్న గౌడ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పాపన్నగౌడ్‌ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని బహుజనులకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేశారన్నారు. బహుజన సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి బీరం సుబ్బారెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, జడ్పీటీసీ మాజీ సభ్యుడు వామన్‌ గౌడ్‌, బీసీ సంఘాల నాయకులు గంధం నాగరాజు, కోళ్ల శివ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.