మీ ఇంటి బిడ్డగా పని చేస్తా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా

వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014లో BRS ప్రభుత్వం అధికారం చేపట్టిన నాడు కేవలం 67 వేల కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉండిందని, 10 సంవత్సరాల BRS పాలన తర్వాత 7 లక్షల 20 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలు తీయించారని

రాష్ట్ర ఆదాయంలో అప్పులకు వడ్డీ కడుతూనే రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి పాటుపడుతున్నారని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది

నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్రటేరియట్ కు రాకుండానే పాలన కొనసాగించేవాడని, నేడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతూ ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసిందని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఉచిత కరెంటు, నిరుపేదలకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, రాయితీ వంట గ్యాస్ సిలిండర్లు, రుణమాఫీ లాంటి పథకాలను అమలు చేసి నిరుపేదలకు వెన్నుదన్నుగా నిలుస్తోందని పేర్కొనడం జరిగింది..

ఈనెల 30వ తేదీన మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని ఇట్టి మీటింగును విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 379 మంది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు 37943964 కోట్ల రూపాయల విలువగల చెక్కులను లబ్ధిదారులకు అందించం.

అదేవిధంగా 229 మంది ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు 44,91500 లక్షల రూపాయల విలువగల చెక్కులను అందజేయడం జరిగింది

తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వనపర్తి నియోజకవర్గ ప్రజల ఇంటిబిడ్డగా పనిచేస్తానని,నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా పాటుపడతానని సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది.

కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్, పాకనాటి కృష్ణయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు సింగిల్ డైరెక్టర్లు అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు