నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ప్రత్యేక చర్చ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గారితో వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు సోమవారం సెక్రటరీయేట్ లోని ముఖ్యమంత్రి గారి ఛాంబర్ లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా వారు వనపర్తి నియోజకవర్గ పరిధిలో చేపట్టే పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు
వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నట్లు ఎమ్మెల్యే గారు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇటీవల ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా DCCB చైర్మన్ తనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు పూర్తిస్థాయిలో సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేశారు.
DCCB చైర్మన్ గా తనకు అప్పజెప్పిన బాధ్యతలను విస్మరించకుండా సహకార సంఘాల బలోపేతానికి, అన్నదాతలకు అందజేసే రుణ ప్రక్రియలోను ఎక్కడ ఇబ్బందులు లేకుండా తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని వారు పేర్కొన్నారు.