ముఖ్యమంత్రితో వనపర్తి ఎమ్మెల్యే ప్రత్యేక భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారితో వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోని అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారుముఖ్యమంత్రి ప్రత్యేక నిధులతో చేపట్టే అభివృద్ధి అంశాలపై, ఖిల్లా ఘనపురం గణపసముద్రంలో భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం, అదేవిధంగా బుద్ధారం రిజర్వాయర్ లో ఏర్పాట్లు భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారులపై చర్చించారు.వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎలాంటి సహాయం కావాలన్నా ఎల్లవేళలా అండగా ఉంటానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే మేఘా రెడ్డి గారు కృతజ్ఞతలు తెలియజేశారు..