ముఖ్యమంత్రి గారి నివాసంలో ప్రత్యేక సమావేశం

జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి గారి నివాసంలో మంచిర్యాల నియోజకవర్గ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొనడం జరిగింది.

విద్యార్థులు పోటీ పరీక్షలకు సంసిద్ధమవుతూ తమ బంగారు భవిష్యత్తు కోసం బాటలు ఏర్పరచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలే తప్ప

రెచ్చగొట్టే ప్రసంగాలను పట్టించుకోకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ గారు విద్యార్థులకు తెలియజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తాము తల్లిదండ్రులకు దూరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వసతి గృహాల్లో, గురుకులాల్లో ఉంటూ చాలీచాలని డైట్ మరియు కాస్మోటిక్ చార్జీలతో ఇన్నాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నామని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు 40శాతం పెంచారని.

1330 రూపాయల వరకు చార్జీలను పెంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది విద్యార్థుల ఇబ్బందులను తొలగించిందని విద్యార్థులు ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి గారు,ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి గారు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు.