ఊర్కొండ మండల పరిధిలోని ముచ్చర్లపల్లి గ్రామానికి చెందిన గంగపురం ఈశ్వరయ్య(60) గత మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది.స్థానిక కాంగ్రెస్ నాయకులు ముచ్చర్ల ధర్మెందర్ రెడ్డి గారి ద్వారా విషయం తెలుసుకున్న పేద ప్రజల దైవం,జన నేత,మండల కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు ద్యాప నిఖిల్ రెడ్డి గారు “DNR యువసేన” పేరిట అంత్యక్రియలకు 5000/- తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు.ఈ నగదును గ్రామ కాంగ్రెస్ నాయకులు, యువసేన సభ్యులు మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు ముచ్చర్ల ధర్మేందర్ రెడ్డి గారు మరియు వార్డు సభ్యులు శ్రీశైలం యాదవ్,మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు తిరుపతయ్య యాదవ్,రఘురాం గౌడ్,బచ్చి రెడ్డి,వడ్డె నరసింహ,ఆలకుంట రాం చంద్రయ్య, బాలస్వామి,మల్లయ్య,దారా రాజు,శ్రీశైలం యాదవ్,లవ కుశ యాదవ్,వెంకటేష్ యాదవ్,బి గణేష్ మరియు మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంఠం శ్రీశైలం గారు పాల్గొని సంతాపం ప్రకటించారు.