మృతుడి కుటుంబానికి ద్యాప నిఖిల్ రెడ్డిగారి ఆర్థిక చేయూత

ఊర్కొండ: మండలంలోని గుడిగానిపల్లి గ్రామానికి చెందిన దాసర్ల రామచంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధారం మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్యాప నిఖిల్ రెడ్డి (DNR) గారు మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల ద్వారా రూ.5000/- అందజేశారు.

ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ సర్పంచ్ రజిత కృష్ణయ్య, నాయకులు కవిత రుక్మారెడ్డి, అలివేలు ఇద్దయ్య, తిరుపతయ్య, సత్యనారాయణ, విజేందర్ రెడ్డి, సంజీవ రెడ్డి, దుర్గయ్య, చంద్రమౌళి, వడ్డే ఆంజనేయులు, భాషమోని వెంకటేష్, మహేష్, లింగం, శ్రీను తదితరులు పాల్గొన్నారు